News August 21, 2024

మృతదేహాలను ఇంట్లోనే భద్రపరుస్తారు.. ఎందుకంటే?

image

ఎవరైనా మరణిస్తే ఆరోజో, మరుసటి రోజో అంత్యక్రియలు పూర్తి చేస్తుంటారు. కానీ, ఇండోనేషియాలోని టోరజా జాతి ప్రజలు దీనికి విరుద్ధం. టోరజాన్ల అంత్యక్రియలు, తదుపరి ఆచారాల కోసం రూ.లక్షలు ఖర్చవుతుంది. డబ్బు లేకపోతే, సమకూర్చేవరకూ మృతదేహాలను లేపనం పూసి ఏళ్లతరబడి ఇంట్లోనే ఉంచుతారు. 12 రోజులపాటు జరిగే ఈ అంత్యక్రియల్లో డజన్ల కొద్దీ గేదెలు, వందల కొద్దీ పందులను బలిస్తారు. అలా చేయకపోతే వారి ఆత్మ శాంతించదని నమ్మకం.

Similar News

News January 23, 2025

ఆ పోస్టులకు మార్చి 2న రాత పరీక్ష

image

AP: జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్చి 2న రాత పరీక్ష నిర్వహించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. గతంలో నిర్వహించిన డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించిన 311 మందికి నెల్లూరు జిల్లా మూలపేటలోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్(APSTARS) పాత సెంట్రల్ జైలు ఆవరణలో పరీక్ష నిర్వహించనుంది. MLV అభ్యర్థులు ఉదయం 8గంటలకు, HMV అభ్యర్థులు మధ్యాహ్నం 12గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

News January 23, 2025

బుమ్రా, భువనేశ్వర్‌ను దాటేసిన హార్దిక్ పాండ్య

image

T20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్, బుమ్రాను హార్దిక్ పాండ్య దాటేశారు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి T20లో 2 వికెట్లు తీసిన హార్దిక్ తన ఖాతాలో 91 వికెట్లు వేసుకున్నారు. ఈ జాబితాలో భువనేశ్వర్‌కు 90, బుమ్రాకు 89 వికెట్లు ఉన్నాయి. అటు ఇండియా తరఫున T20ల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో చాహల్‌ను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు.

News January 23, 2025

100 కోట్ల ఓటర్ల దిశగా భారత్

image

భారత్‌లో ఓటర్ల సంఖ్య 99.1కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 96.88కోట్లుగా ఉండేది. ఓటర్లలో యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 18-29ఏళ్ల వయస్సున్న వారు ఏకంగా 21.7కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. భారత్ త్వరలోనే 100కోట్ల మంది ఓటర్లతో రికార్డ్ సృష్టించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.