News November 1, 2024
ఉ.కొరియా సైనికుల శవాలు బ్యాగుల్లో వెళ్తాయి: US
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బలగాలను ఉపసంహరించుకోవాలని ఐరాసలోని US డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ హెచ్చరించారు. లేదంటే వారి శవాలు బ్యాగ్‌లలో తిరిగెళ్తాయని స్పష్టం చేశారు. వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నప్పుడు మాస్కోకు ఉ.కొరియా మద్దతు ఇస్తే తప్పేంటని రష్యా రాయబారి వాసిలీ నెజెంబియా ప్రశ్నించారు.
Similar News
News November 1, 2024
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీబీసీ కౌంటర్ వరకు భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 63987 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు లభించింది.
News November 1, 2024
కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
ఏపీలో నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు.
మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులుండగా ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందించారు. పలు కారణాలతో ఇవాళ పెన్షన్ అందుకోలేని వారికి రేపు అందించనున్నారు. ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించేందుకు ఇవాళ CM చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.
News November 1, 2024
IPL రిటెన్షన్లలో బ్యాటర్లదే పైచేయి
నిన్న IPL రిటెన్షన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. ఈ రిటెన్షన్‌లో ఫ్రాంచైజీలు ఎక్కువగా బ్యాటర్లనే రిటైన్ చేసుకున్నాయి. మొత్తం 28 మంది బ్యాటర్లు రిటైన్ కాగా బౌలర్లు కేవలం 11 మంది రిటైన్ అయ్యారు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే ఏడుగురిని ఆయా జట్లు తమతో అట్టిపెట్టుకున్నాయి. అత్యధిక ధర కూడా బ్యాటర్లకే పలికిన విషయం తెలిసిందే.