News July 26, 2024

గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీఅడిక్షన్ సెంటర్లు: అనిత

image

AP: రాష్ట్రంలోని గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అనిత తెలిపారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ‘గత పాలకులు రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారు. యువతకు ఉపాధి లేక డ్రగ్స్ రవాణా చేశారు. దాడుల సంఖ్యపై మాజీ సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారు. దాడులకు గురైనవారి జాబితా ఇస్తే మేం అక్కడకు వెళ్తాం’ అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.

Similar News

News April 1, 2026

కస్టమర్లకు ఈరోజు బ్యాంక్ సేవలు దూరం

image

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈరోజు బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఈరోజు బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు కొనసాగుతాయి. రేపు యథావిధిగా బ్యాంకులు కొనసాగనుండగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎల్లుండి మళ్లీ సెలవు ఉంటుంది.

News April 1, 2026

రాష్ట్రంపై క్యాన్సర్ పంజా..!

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది చివరి నాటికి 46,762 క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ICMR నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో పురుషులు 21,252 మంది కాగా.. మహిళలు 25,510 మంది ఉన్నారు. పొగాకు వల్లే పురుషుల్లో 58.8%, మహిళల్లో 29.7% క్యాన్సర్లు వస్తున్నాయి. ఇక HYDలో ప్రతీ ఆరుగురు మహిళల్లో ఒకరికి ముప్పు ఉంది. పురుషుల్లో ఓరల్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంది.

News April 1, 2026

ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్

image

తెలంగాణలో కోడి మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలనే డిమాండ్‌తో రిటైల్ యజమానులు నేటి నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేశారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఇవ్వగా ఇటీవల పౌల్ట్రీలు దాన్ని రూ.16కు తగ్గించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఓనర్స్ అంటున్నారు. మార్జిన్‌ను రూ.30కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో చికెన్ దుకాణాలు 2-3 రోజుల వరకు మూతపడే అవకాశం ఉంది.