News August 29, 2024

సెంట్రల్ జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్లు

image

AP: రాజమహేంద్రవరం, విశాఖ, నెల్లూరు, కడప సెంట్రల్ జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్లు సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.2.45 లక్షల చొప్పున నాలుగింటికి కలిపి రూ.9.80 లక్షల వ్యయం కానుంది. కేంద్ర కారాగారాల్లో గంజాయికి అలవాటు పడిన ఖైదీలు చాలామంది ఉన్నారు. దీంతో జైలులోనే వారికి కౌన్సెలింగ్, వ్యసన విముక్తి కలిగించేలా ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నారు.

Similar News

News October 23, 2025

తుని ఘటనలో సంచలన విషయాలు

image

AP: కాకినాడ(D) తునిలో బాలికపై వృద్ధుడి <<18071366>>లైంగికదాడి <<>>కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గురుకులలో చదువుతున్న అమ్మాయికి తినుబండారాలు కొనిచ్చి, మాయమాటలు చెప్పి నిందితుడు నారాయణరావు(62) దగ్గరయ్యాడని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపిస్తానని స్కూలు నుంచి పలుమార్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అతడిపై పోక్సో సహా 3 కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

News October 23, 2025

నేడు..

image

* ఇవాళ <<18073538>>తెలంగాణ<<>> మంత్రివర్గ సమావేశం.. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం
* గోరక్షక్ దళ్ సభ్యుడిపై దాడికి నిరసనగా డీజీపీ ఆఫీసు ఎదుట బీజేపీ నేతల నిరసన
* వైసీపీ చీఫ్ జగన్ మీడియా <<18075756>>సమావేశం<<>>
* WWCలో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమ్ఇండియా
* ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్, ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

News October 23, 2025

బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

image

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్​కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.