News December 1, 2024

IT రిటర్నులకు ఈ నెల 15 వరకు గడవు పొడిగింపు

image

2023-2024కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు CBDT వెల్లడించింది. గత నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితోనే గడువుగా ముగియగా పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ అవకాశం కల్పించినట్లు తెలిపింది.

Similar News

News December 4, 2025

WGL: తొలి విడత బరిలో 10,901 అభ్యర్థులు

image

ఉమ్మడి జిల్లాలో తొలివిడత 555 సర్పంచ్ స్థానాలకు 1,817, 4,952 వార్డు స్థానాలకు 9,084 నామినేషన్లు దాఖలయ్యాయి. WGLలో 91 GPలకు 305, 800 వార్డులకు 1427 నామినేషన్లు వచ్చాయి. HNKలో 69 GPలకు 264, 658 వార్డులకు 1339, JNలో 110 GPలకు సర్పంచ్ 340, 1024 వార్డులకు 1893, MHBDలో 155 GPలకు 468, 1338వార్డులకు 2391, ములుగులో 48 GPలకు178, 420 వార్డులకు 557, BHPLలో 82 GPలకు 262, 712 వార్డులకు 1,477 నామినేషన్లు పడ్డాయి.

News December 4, 2025

పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

image

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.

News December 4, 2025

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్‌కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.