News July 8, 2024
ఒప్పందం జరిగినా యుద్ధం ఆగకూడదు: నెతన్యాహు

ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలు చేరుకునేవరకు యుద్ధం జరిగేలా ‘గాజా’ కాల్పుల విరమణ ఒప్పందం ఉండాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా చేసిన సీజ్ ఫైర్ ప్రతిపాదనకు హమాస్ కొన్ని రోజుల క్రితం సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ ఒప్పందాన్ని అంగీకరించడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయాలని, హమాస్ 120మంది బందీలను విడుదల చేయాలనేది తాజా ఒప్పందంలో ప్రతిపాదన.
Similar News
News October 14, 2025
గ్రౌండ్లోకి గులాబీ బాస్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కార్యకర్తల్లో మరింత ఊపు తీసుకొచ్చి, ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నవంబర్ మొదటి వారంలో ప్రచారానికి రానున్నారు. ఎర్రవల్లిలో పార్టీ అభ్యర్థి సునీతకు Bఫారమ్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభలోనా? లేక రోడ్ షోలో పాల్గొంటారనేది తెలియాల్సి ఉంది.
News October 14, 2025
బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?
News October 14, 2025
పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్టర్మ్లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.