News May 7, 2024
పిరమైన మోదీ గారు.. వీటికి సమాధానం చెప్పండి: KTR
TG: ఇవాళ తెలంగాణకు వస్తున్న PM మోదీకి మాజీ మంత్రి KTR పలు ప్రశ్నలు సంధించారు. ‘పిరమైన PM మోదీ గారు.. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి? బయ్యారం స్టీల్ ప్లాంట్, ITIR, నవోదయ, మెడికల్ కాలేజీ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి? మండిపోతున్న నిత్యావసర, పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదో చెప్పండి?’ అని KTR ప్రశ్నించారు.
Similar News
News January 6, 2025
Stock Markets: ఆరంభంలో విలవిల
స్టాక్ మార్కెట్లు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,141 (-83), నిఫ్టీ 23,962 (-41) వద్ద ట్రేడవుతున్నాయి. ఫియర్ ఇండెక్స్ INDIA VIX 7.38% పెరగడం ఆందోళనకరం. IT, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. TATA STEEL, KOTAK, BPCL, COALINDIA, ADANIENT టాప్ లూజర్స్.
News January 6, 2025
EXCLUSIVE: భారత్‌లో చైనా వైరస్ తొలి కేసు!
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్‌నూ చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా పేరంట్స్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) పాజిటివ్‌గా తేలింది. దీనిపై సమాచారం అందినట్లు పేర్కొన్న కర్ణాటక ప్రభుత్వం తమ ల్యాబులో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఆ చిన్నారి విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం.
News January 6, 2025
ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్లు?
ప్రశాంత్ నీల్-Jr.NTR సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో మలయాళ స్టార్లు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో NTR కొత్త లుక్‌లో కనిపించనున్నారు.