News October 3, 2025
‘డియర్ రావణ్’.. నటి ట్వీట్‌పై వివాదం

దసరా వేళ బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘డియర్ రావణ్. టెక్నికల్‌గా మీరు చెడ్డవారు కాదు. చిలిపివారు. సీతకు మంచి ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్స్‌ను పెట్టారు. మ్యారేజ్ రిక్వెస్ట్ వినయంగా చేశారు. రాముడు చంపుతున్నప్పుడూ క్షమాపణలు చెప్పారు. మా పార్లమెంట్‌లోని సగం మంది కంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్’ అని పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో పోస్టును డిలీట్ చేశారు.
Similar News
News October 3, 2025
సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనం, రాష్ట్ర బీజేపీ ఆఫీస్, నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్ అని తేల్చారు. ఈ నేపథ్యంలో చెన్నై అల్వార్‌పేటలోని CM ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
News October 3, 2025
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ నెల 5న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డిలో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 3, 2025
‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్!

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ప్రీమియర్స్‌తో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.65 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కూలీ(రూ.65 కోట్లు), ఛావా(రూ.31 కోట్లు), సికందర్(రూ.26 కోట్లు), సైయారా(రూ.22 కోట్లు) చిత్రాల తొలిరోజు కలెక్షన్లను అధిగమించిందని వెల్లడించాయి.