News May 3, 2024
మరణమే మా నాన్నకొచ్చిన వారసత్వ ఆస్తి: ప్రియాంక

వారసత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి రాజీవ్ గాంధీకి వాళ్ల అమ్మ(ఇందిరా గాంధీ)నుంచి ఆస్తికి బదులు మరణమే వారసత్వంగా వచ్చిందన్నారు. కాంగ్రెస్ బర్రెలు తీసుకుంటుందని ప్రధాని అబద్దాలు చెప్పడం మానేసి.. యూపీ, మధ్యప్రదేశ్లో ఆవులు, గేదేలకు షెల్టర్లు నిర్మించాలన్నారు. దేశంలో ఎన్నడూ లేని రీతిలో బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు.
Similar News
News January 18, 2026
NSUTలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT)లో 31 టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 3వరకు పంపవచ్చు. పోస్టును బట్టి BE/BTech/BS/ME/MTech/MS, M.Arch, MBA/PGDM/CA/ICWA/M.Com, PhD ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. అసోసియేట్ ప్రొఫెసర్కు 50ఏళ్లు. వెబ్సైట్: https://nsut.ac.in
News January 18, 2026
వాహనంలో పశువుల తరలింపు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు(1/2)

వాహనాల ద్వారా పశువులను తరలించేటప్పుడు అవి కిక్కిరిసినట్లుగా ఉండకూడదు. వాటికి సరైన గాలి, వెలుతురు తగిలేలా, ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి. వాహనంలో కనీసం 5 సెంటీమీటర్ల మందంతో వరి గడ్డిని వేయాలి. గొర్రెలు, మేకలను కలిపి ఒకే వాహనంలో కాకుండా వేరువేరుగా రవాణా చేయాలి. ఈనే అవకాశం ఉన్న నిండు చూడి జీవాలను, ఈని మూడు రోజులు కూడా కాని పశువులను వాహనంలో తరలించకూడదు.
News January 18, 2026
ఇతిహాసాలు క్విజ్ – 127

ఈరోజు ప్రశ్న: మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి కూడా, పాండవుల విజయాన్ని కోరుకున్నది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


