News July 18, 2024
జాహ్నవి కందుల మృతి: అధికారిపై వేటు
గత ఏడాది జనవరిలో జాహ్నవి కందుల అనే తెలుగు యువతి అమెరికాలో ఓ పోలీసు కారు ఢీకొని కన్నుమూశారు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ముఖ్యంగా డానియెల్ అడెరర్ అనే పోలీసు అధికారి ఆమె మృతి గురించి <<12716575>>చులకనగా మాట్లాడుతూ<<>> పగలబడి నవ్వడం అందరినీ బాధించింది. తాజాగా సదరు అధికారిని సియాటెల్ పోలీస్‌శాఖ విధుల నుంచి తొలగించింది. అతడు పోలీసుగా ఉండటం డిపార్ట్‌మెంట్‌కే అవమానకరమని ఆ శాఖ చీఫ్ సూ రహర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News December 26, 2024
సోనియా గాంధీకి అస్వస్థత?
ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సోనియా పాల్గొనాల్సి ఉంది. కానీ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆమెతోపాటు ప్రియాంకా గాంధీ కూడా అక్కడే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ మాత్రమే పాల్గొన్నారు.
News December 26, 2024
పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్
TG: అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడంతోనే అరెస్టు చేశారన్న <<14906777>>ప్రచారంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్‌పై ఉంది కదా?’ అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినని రేవంత్ పేర్కొన్నారు.
News December 26, 2024
ఆ కారణం వల్లే మహాత్మాగాంధీ హత్య: సోనియా
పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఐకమత్యంగా ముందుకు సాగుదామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ బెలగావి సభలో నేతలకు ఓ సందేశంలో తెలిపారు. ‘స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటమూ చేయని సంస్థలు మహాత్మాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక విషతుల్యమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. వాటి వల్లే ఆయన హత్య జరిగింది. కేంద్రంలో అధికారానికి వచ్చిన వారి వల్ల గాంధీ ఘనత ప్రమాదంలో పడింది’ అన్నారు.