News September 28, 2024

పప్పమ్మాళ్ జీ మరణం చాలా బాధను కలిగించింది: PM మోదీ

image

105 ఏళ్ల ‘సేంద్రీయ వ్యవసాయ’ మహిళారైతు పప్పమ్మాళ్ కన్నుమూయడం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆమె మరణం చాలా బాధను కలిగించింది. ప్రత్యేకించి సేంద్రీయ వ్యవసాయంలో ఆమె తన ముద్ర వేశారు. పప్పమ్మాళ్ జాలి, దయా గుణాలతో ప్రజాదరణ పొందారు. ఈ సమయంలో ఆమె కుటుంబీకులు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. పప్మమ్మాళ్ 1914లో కోయంబత్తూర్ సమీపంలో జన్మించారు.

Similar News

News January 23, 2026

‘రిపబ్లిక్ డే‘ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

image

AP: రిపబ్లిక్ డే ని మొదటిసారి ఈ ఏడాది అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో నిర్వహించేందుకు CRDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమరావతి రైతులకు ప్రత్యేక VIP గ్యాలరీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 13 వేల మందికి వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవాలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేపట్టేవారు.

News January 23, 2026

గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది!

image

AP: 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని CM CBN అధికారులను ఆదేశించారు. 3వ సారి ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ‘పోలవరం’ పనులు ఈలోగా పూర్తిచేయాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు 10కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

News January 23, 2026

వంట గది ఏ వైపున ఉండాలి?

image

వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల సరిపడా గాలి, వెలుతురు వచ్చి ఇల్లాలు అలసట లేకుండా వంట చేయగలదని చెబుతున్నారు. ‘వంటగదిలో పూజ గది ఉండటం శ్రేయస్కరం కాదు. శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగుళ్లు ఇచ్చిన గాజు, పింగాణీ పాత్రలను ఉంచకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వంట రుచికరంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>