News September 26, 2024
ఉరిశిక్ష ఖైదీ.. 46ఏళ్ల జైలుజీవితం తర్వాత నిర్దోషిగా విడుదల

కాల మహిమ అంటే ఇదే! జపాన్‌లో ఓ ఉరిశిక్ష ఖైదీ 46 ఏళ్ల జైలుజీవితం తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. 1968లో తను పనిచేసే ఓనర్ ఫ్యామిలీని హత్యచేశారని ఇవాయో హకమాడను అరెస్టు చేశారు. క్రైమ్‌సీన్ దగ్గర్లోని బావిలో దొరికిన రక్తం అంటిన దుస్తులు అతడివేనని కోర్టు శిక్ష వేసింది. పోలీసుల టార్చర్‌తో చేయని నేరం అంగీకరించానని ఆ తర్వాత చెప్పడంతో మళ్లీ విచారణ కొనసాగింది. ఆ బట్టలపై రక్తం ఆయనది కాదని DNA టెస్టులో తేలింది.
Similar News
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
News December 10, 2025
తాజా సినీ ముచ్చట్లు

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్‌ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి


