News May 30, 2024
అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు!

అంబటి రాయుడు భార్యకు కోహ్లీ ఫ్యాన్స్ నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన స్నేహితుడు సామ్‌పాల్ వెల్లడించారు. ‘1,4 ఏళ్ల వయసున్న కుమార్తెలను హత్యాచారం చేస్తామని బెదిరించారని రాయుడు భార్య చెప్పింది. ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. IPLని గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని రాయుడు పరోక్షంగా కోహ్లీపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 17, 2026
డబ్బులే డబ్బుల్.. దేశంలో భారీగా క్యాష్ ట్రాన్సాక్షన్స్

దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు కొనసాగుతున్నా ఇంకా నగదు చలామణి భారీగా ఉందని SBI లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. JANలో రూ.40లక్షల కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. నగదు చలామణిలో 97.6% ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. నెలకు రూ.40లక్షల కంటే ఎక్కువ UPI లావాదేవీలు జరిపితే GST నోటీసులు, ఇన్‌కమ్ ట్యాక్స్ భయాలతో నగదు బదిలీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
News February 17, 2026
300కు 300 మార్కులు

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.
News February 17, 2026
ఇండియాకు మాక్రాన్.. రఫేల్ డీల్‌పై ఫోకస్!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ముంబైలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ‘హొరైజాన్ 2047 రోడ్‌మ్యాప్’లో భాగంగా డిఫెన్స్, స్పేస్, అణుశక్తి ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల సహకారంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపైనా భారీ డీల్ కుదిరే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే AI సమ్మిట్‌లోనూ మెక్రాన్ పాల్గొననున్నారు.


