News August 12, 2025
టెంపో ప్రమాదంలో.. 10కి చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర పుణే జిల్లా మహాలుంగేలో <<17371241>>టెంపో<<>> లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 40 మంది ఉన్నారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా కుందేశ్వర్ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News August 12, 2025
TG అప్పులు రూ.3.50 లక్షల కోట్లు: కేంద్రం

TG: 2024 మార్చి 31నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. MP రఘునందన్‌రావు ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పదేళ్లలో BRS ప్రభుత్వం రూ.3,14,545 కోట్లు అప్పు చేసినట్లు తేల్చింది. 2014-15లో రాష్ట్ర అప్పులు రూ.69,603.87 కోట్లు, ఆస్తులు రూ.83,142.68 కోట్లుగా ఉన్నాయి. 2023-2024నాటికి అప్పులు రూ.3,50,520.39 కోట్లు, ఆస్తులు రూ.4,15,099.69 కోట్లకు పెరిగాయి.
News August 12, 2025
EP33: ఈ రెండూ మిమ్మల్ని నాశనం చేస్తాయి: చాణక్య నీతి

మనిషి జీవితాన్ని, ప్రశాంతతను.. కోపం, దురాశ రెండూ సర్వ నాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతోంది. రోజూ కోపంగా ఉండేవాళ్లు బతికుండగానే నరకాన్ని అనుభవిస్తుంటారని దీని సారాంశం. అలాగే మీకు దురాశ ఉంటే జీవితం సర్వనాశనం అవుతుందని చాణక్య నీతిలో చెప్పారు. లైఫ్‌లో ఏది సాధించాలన్నా కోపం, దురాశను వదిలి జ్ఞానంవైపు అడుగులు వేయాలని వివరించారు. జ్ఞానంతోనే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. <<-se>>#Chankyaneeti<<>>
News August 12, 2025
ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ బుక్స్ పంపిణీ!

AP: రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆగస్టు 15-31 వరకు తొలి విడతగా కొత్త పాస్ బుక్స్‌ను కొందరు రైతులకు అందిస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వం పాస్‌బుక్స్‌పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. విడతల వారీగా 20 లక్షల మందికిపైగా ఈ కొత్త పాస్ బుక్స్ అందించనున్నారు.