News August 21, 2024

కార్మికుల మరణాలు బాధాకరం: గవర్నర్

image

AP: అచ్యుతాపురం ఫార్మా <<13910421>>ఘటనపై<<>> గవర్నర్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు మరణించడం బాధాకరమని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మరోవైపు సీఎం ఆదేశాలతో వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు అనకాపల్లికి వెళ్లారు. బాధితులను KGHకు తరలిస్తామని చెప్పారు. మృతదేహాలకు వీలైనంత త్వరగా పోస్టుమార్టం చేయిస్తామన్నారు.

Similar News

News July 10, 2025

జిల్లా కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం

image

AP: అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ యాక్ట్ అమెండ్‌మెంట్-2023 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో చట్టం అమల్లోకి వచ్చింది. గతంలో ఈ అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉండేది. దీంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులు పేరుకుపోతుండటంతో ప్రభుత్వం ఈ మార్పులు చేసింది.

News July 10, 2025

రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యూట్యూబర్లు శ్రీముఖి, శ్యామల, హర్షసాయి, సన్నీయాదవ్, లోకల్ బాయ్ నాని సహా 29 మందిపై ED కేసు నమోదు చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేశారని మియాపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో FIR నమోదైన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలకు దిగింది.

News July 10, 2025

టోకెన్లు లేని భక్తులకు 20 గంటల సమయం

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న 76,501 మంది స్వామివారిని దర్శించుకోగా, 29,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.