News January 19, 2025
WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?

ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్‌ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.
Similar News
News January 10, 2026
ఇండియన్ సినీ చరిత్రలో ప్రభాస్ ఒక్కడే!

రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. నిన్న రిలీజైన ‘రాజాసాబ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్) రూ.100 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. ప్రభాస్ ‘సిక్స్’ కొట్టి ‘బాక్సాఫీస్ బాద్షా’గా నిలిచారంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
News January 10, 2026
10 పరుగుల తేడాతో ఓటమి

WPL-2026లో గుజరాత్ జెయింట్స్ చేతిలో యూపీ వారియర్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 207 రన్స్ చేయగా ఛేదనలో యూపీ 197-8 స్కోరుకు పరిమితమైంది. చివరి 3 బంతుల్లో 6, 4, 4 బాదినా ప్రయోజనం లేకపోయింది. లిచ్‌ఫీల్డ్(78) అర్ధసెంచరీ చేయగా మెగ్ లానింగ్(30), శ్వేత(25) రన్స్ చేశారు. GG బౌలర్లలో రేణుకా, జార్జియా, సోఫీ తలో 2 వికెట్లు తీశారు. గార్డ్నర్, రాజేశ్వరీ చెరో వికెట్ తీశారు.
News January 10, 2026
రూ.3వేల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మక్తా మహబూబ్ పేటలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. భూఆక్రమణల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించి తాజాగా హద్దులను నిర్ణయించి ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూముల విలువ ₹3వేల కోట్లు ఉంటుందని పేర్కొంది. తప్పుడు సర్వే నంబర్లతో కబ్జాకు పాల్పడిన ఇమ్రాన్‌పై కేసు నమోదైంది.


