News January 19, 2025

Debate: తమ్ముళ్ల ఆలోచన అదేనా..?

image

లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే TDP డిమాండ్‌పై నెట్టింట డిబేట్ అవుతోంది. గతంలో కీలక మంత్రిగా, ప్రతిపక్షంలో పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఈ పదవికి అర్హుడని TDP అంటోంది. కానీ ఇది పవన్‌ను కంట్రోల్ చేసే స్టెప్ అనేది జనసేన వర్షన్. చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పవన్‌ను బ్యాలెన్స్ చేయాలంటే లోకేశ్ No.2గా ఉండాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన అంటున్నారు. మరి నిజంగానే క్యాడర్ కోరికనా? కట్టడి ప్రయత్నమా?

Similar News

News January 30, 2026

సూపర్ సెంచరీ.. 49 బంతుల్లో 115 రన్స్

image

సెంచూరియన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లోనే సెంచరీ చేశారు. 10 సిక్సులు, 6 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. డికాక్ (49 బంతుల్లో 115), రికెల్టన్ (36 బంతుల్లో 77*) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో WI నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని SA 17.3 ఓవర్లలోనే ఛేదించింది. WI బ్యాటర్లలో హెట్‌మయర్ (42 బంతుల్లో 75), రూథర్ ఫర్డ్ (24 బంతుల్లో 57) రాణించారు.

News January 30, 2026

జనవరి 30: చరిత్రలో ఈ రోజు

image

* 1882: US మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ జననం
* 1933: జర్మనీకి వైస్ ఛాన్స్‌లర్‌గా అడాల్ఫ్ హిట్లర్ నియామకం
* 1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
* 1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
* 2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
* 2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
* అమరవీరుల సంస్మరణ దినం

News January 30, 2026

అల్లు అర్జున్-లోకేశ్ సినిమాలో శ్రద్ధా కపూర్?

image

తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉందని సినీవర్గాలు వెల్లడించాయి. డైరెక్టర్ ఆమెను సంప్రదించి స్టోరీ వినిపించినట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. కాగా బన్ని ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అందులో దీపికా పదుకొనె నటిస్తున్నారు.