News July 14, 2024

సచివాలయ భద్రత మార్పుపై చర్చ?

image

TG: సచివాలయంలో భద్రత మార్పు చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ నివేదికతో గతంలో తొలగించిన SPF సిబ్బందిని తిరిగి తీసుకోవాలనుకోవడం ఏంటని ప్రస్తుతం విధుల్లో ఉన్న TGSP పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవినీతి చేయకుండా వీవీఐపీల భద్రతే లక్ష్యంగా పనిచేసే తమను తొలగిస్తామనడం సరికాదంటున్నారు. ఉన్నపళంగా తమను బదిలీ చేయొద్దని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Similar News

News October 16, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

* రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇప్పటికే షూట్ పూర్తయింది
* ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈనెల 23న ‘ఫౌజీ’ సినిమా నుంచి అప్డేట్స్ రానున్నాయి.
* మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చి ఫుట్‌పాల్ పెరిగిందని, కానీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యలు ఎంతో కష్టపడి తీసిన చిత్రాన్ని ఇబ్బందిపెట్టాయని ‘అరి’ డైరెక్టర్ జయశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు

News October 16, 2025

రబీలో కుసుమ సాగుకు అనువైన రకాలు

image

రబీలో సాగుకు అనువైన నూనెగింజ పంటల్లో కుసుమ ఒకటి. ఇది ఔషధ మొక్కగా, నూనెగింజ పంటగా విశిష్ఠ ప్రాధాన్యత కలిగి ఉంది. చల్లని వాతావరణంలో ఇది అధిక దిగుబడినిస్తుంది. అక్టోబరు చివరి వరకు ఈ పంటను నాటుకోవచ్చు. టి.ఎస్.ఎఫ్-1, నారీ-6, నారీ ఎన్.హెచ్-1, పి.బి.ఎన్.ఎస్-12, D.S.H-185, ఎస్.ఎస్.ఎఫ్-708 వంటి రకాలు అధిక దిగుబడిని అందిస్తాయి. నారీ-6 రకం ముళ్లు లేనిది. ఎకరాకు 7.5kgల నుంచి 10kgల విత్తనం సరిపోతుంది.

News October 16, 2025

స్థిరంగా బంగారం ధరలు!

image

భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. మార్కెట్లకు సెలవు లేకపోయినా ధన త్రయోదశి ముందు బంగారం ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,650గా ఉంది. అటు వెండి ధర రూ.1,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,06,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.