News July 18, 2024
రుణమాఫీ.. బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన

TG: రుణమాఫీ డబ్బులు ఇవాళ అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులను రైతుల ఇతర అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Similar News
News November 21, 2025
గిల్‌కు నేడు ఫిట్నెస్ టెస్ట్

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ గిల్ ఫిట్నెస్ టెస్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌తోపాటు గువాహటి వెళ్లిన గిల్.. నిన్న ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. అతడు మ్యాచ్ ఆడే ఛాన్స్‌లు తక్కువేనని సమాచారం. గిల్ కోలుకుంటున్నారని, ఇవాళ సాయంత్రం ఫిజియోలు, డాక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. తొలి టెస్టులో మెడ నొప్పితో గిల్ మైదానాన్ని వీడటం తెలిసిందే.
News November 21, 2025
గుమ్మానికి నిమ్మ, మిరపకాయ ఎందుకు కడతారు?

ఇళ్లు, షాప్ గుమ్మాలకు, వాహనాలకు నిమ్మ, మిరపకాయలు కడుతుంటారు. ఇది చెడు దృష్టిని తొలగిస్తుందని నమ్మకం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాల వాడకం పెంచేందుకే పూర్వీకులు ఈ పద్ధతిని ప్రోత్సహించారని అంటారు. ఇలా కడితే ఇంటి చుట్టూ ఉండే వాతావరణం శుభ్రమవుతుంది. వాహనాలకు వీటిని తగిలించడం వలన వీటిలోని సానుకూల శక్తి చుట్టూ ఉండే చెడు దృష్టిని తొలగించి, ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందని విశ్వాసం.
News November 21, 2025
ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్‌కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.


