News December 12, 2024
DEC-14న కోకాపేట్‌కు సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లోని దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని శనివారం ప్రారంభించాడినికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా రానున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిరథులు వస్తున్నారని తుర్కయంజాల మున్సిపాలిటీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ తెలిపారు.
Similar News
News January 14, 2025
HYD: బస్ స్టేషన్లలో ఇదీ పరిస్థితి..!
HYDలోని గచ్చిబౌలి, జేబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో ఇప్పటికీ పలువురు గ్రామాలకు వెళ్తున్నారు. నేడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కొంత మంది నేడు ఉదయం ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో బస్ స్టేషన్లలో కొద్దిమేర రద్దీ నొలకొంది. నేడు ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలులో ఉండదని అధికారులు తెలిపారు. సాధారణంగా ఉండే బస్సుల్లోనే తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 14, 2025
HYD: మాంజా.. ప్రాణాలకు ముప్పు: డీసీపీ
HYD సీపీ ఆదేశాలతో ప్రమాదకరమైన చైనా మాంజా అమ్మకాలను అరికట్టినట్లు DCP సుదీంద్ర తెలిపారు. గాలిపటాలకు వాడే సింథటిక్ తీగ మానవ, వన్యప్రాణుల జీవితానికి ముప్పు అని తెలిపారు. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. OCT- JAN మధ్య ఈ దారాలకు సంబంధించి 107 కేసులు నమోదు చేసి 148 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.88లక్షల బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
News January 14, 2025
SUPER.. దేశంలోనే మొదటి పార్కింగ్ కాంప్లెక్స్ మన HYDలో..!
HYD నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ పార్కింగ్‌ను 15 అంతస్తులు మేర, జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. దేశంలో ఇదే మొట్ట మొదటి పెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది.