News December 12, 2024

DEC-14న కోకాపేట్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లోని దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని శనివారం ప్రారంభించాడినికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా రానున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిరథులు వస్తున్నారని తుర్కయంజాల మున్సిపాలిటీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ తెలిపారు.

Similar News

News December 12, 2024

జర్నలిస్టు రంజిత్‌కు జెగోమేటిక్ బోన్ సర్జరీ

image

నటుడు మోహన్ బాబు చేతిలో దాడికి గురైన జర్నలిస్ట్ రంజిత్‌కు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గురువారం జైగోమేటిక్ బోన్ సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతమైందని, రంజిత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జైగోమాటిక్ బోన్‌కు మొత్తం 3 పొరల్లో ఫ్రాక్చర్స్ ఏర్పడగా.. సర్జరీ చేసి ప్లేట్‌లు అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు.

News December 12, 2024

జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని రూపొందించాలి: TSJU

image

జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కోరుతూ TSJU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. చిన్న పత్రికల ఎంప్యానల్ మెంట్ చేయాలని, జర్నలిస్ట్ పెన్షన్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వారు కోరారు. అలాగే రూ.10 లక్షల ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలని కోరారు.

News December 12, 2024

HYD: ఆన్‌లైన్‌ గేమింగ్.. బీ కేర్‌ ఫుల్!

image

ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమాదకరమని‌ HYD సైబర్ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ‘X’లో పోస్ట్‌ చేశారు.
‘ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్స్‌ ద్వారా మాల్‌వేర్‌తో డేటాచోరీ అవుతుంది. గేమింగ్ పేరిట బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు సేకరిస్తారు. మీకు తెలియకుండానే అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌ డ్రా అవుతుంది. APK ఫైల్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు.’ అని పోలీసులు సూచించారు.

SHARE IT