News December 27, 2024
చిల్డ్రన్స్ డేకి DEC 26 సరైన రోజు: కిషన్ రెడ్డి
TG: బాలల దినోత్సవాన్ని NOV 14న నిర్వహించడం సరి కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధర్మం కోసం గురుగోవింద్ సింగ్ పిల్లలు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 26న నిర్వహించాలన్నారు. ప్రధాని సూచనలతో DEC 26ను వీర్ బాల్ దివస్‌గా ప్రతి పాఠశాలలో నిర్వహించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిపారు. వీర్ బాల్ దివస్‌ను పాఠ్యాంశంగా చేర్చే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Similar News
News December 28, 2024
రాజమౌళి SSMB29 నుంచి క్రేజీ అప్‌డేట్!
దేశంలోనే క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా ఇప్పటికే హైప్ దక్కించుకున్న రాజమౌళి-SSMB29 చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌కు ప్రియాంకా చోప్రా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అలాగే మరో కీలక పాత్రలో మలయాళ విలక్షణ నటుడు పృథ్విరాజ్ నటించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంక్రాంతి తరువాత జరగొచ్చని సమాచారం.
News December 28, 2024
ప్రొ కబడ్డీ సీజన్-11.. ఫైనల్‌కు పట్నా పైరేట్స్
ప్రొ కబడ్డీ సీజన్-11లో పట్నా పైరేట్స్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్-2లో ఢిల్లీ దబాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32-28 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హరియాణా, పట్నా జట్లు తలపడనున్నాయి. తొలి సెమీస్‌లో యూపీ యోధాస్‌పై 28-25 తేడాతో హరియాణా గెలిచింది.
News December 28, 2024
ED ఆఫీసుపై CBI రైడ్.. అది కూడా లంచం కేసు
లంచం కేసులో ED ఆఫీసుపై CBI రైడ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సిమ్లా ED ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ దీప్ ఓ కేసులో ప్రైవేటు వ్యక్తి నుంచి ₹55 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో CBI రంగంలోకి దిగింది. విశాల్ తప్పించుకోగా అతని తమ్ముడు దొరికిపోయాడు. లంచం డబ్బు ₹55 లక్షలతోపాటు విశాల్ ఆఫీసులో మరో ₹56 లక్షల నగదును CBI సీజ్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.