News December 1, 2025

DEC 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం: వేణుగోపాల్ రావు

image

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు ప్రకటించారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమంపై అవగాహన పెంపే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Similar News

News December 6, 2025

గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలి: పవన్

image

AP: అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు జీవనోపాధి, ఆదాయ మార్గాలను పెంచాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలన్నారు. ‘అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడ సినిమాలు, సీరియళ్ల షూటింగులకు ప్రోత్సాహం ఇవ్వాలి. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.

News December 6, 2025

సిద్దిపేట: సర్పంచ్ పోరు.. ఇక్కడ బాల్యమిత్రులే ప్రత్యర్థులు

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పంచాయతీ ఎన్నికల్లో బాల్యమిత్రులు ద్యావనపల్లి శ్రీనివాస్, బొల్లం శ్రీధర్ సర్పంచ్‌ పదవికి ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకే పాఠశాల, ఒకే బెంచీ నుంచి ఎదిగిన వీరి పోరు ఆసక్తి రేపుతోంది. గతంలో భార్య ద్వారా గెలిచిన అనుభవం శ్రీనివాస్‌కు బలం కాగా, యువత మద్దతు శ్రీధర్‌కు అదనపు బలంగా ఉంది. ఈ పోటీలో పాత సేవలు గెలుస్తాయా, కొత్త వాగ్దానాలా అనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది.

News December 6, 2025

EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.