News November 30, 2025
DEC 5న ఓటీటీలోకి ‘ది గర్ల్‌ఫ్రెండ్’

నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 5 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
Similar News
News April 13, 2026
డెలివరీ తర్వాత ఒంటరిగా ఉంటే డిప్రెషన్ ముప్పు

డెలివరీ తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. శరీరంలో జరిగే మార్పుల వల్ల చాలా మంది మహిళలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు, భర్త, అత్తమామలతో కలిసి ఉండటం వల్ల డిప్రెషన్ ముప్పు తగ్గుతుందని ఫిన్లాండ్‌లోని హెల్సింకీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి డెలివరీ తర్వాత కోలుకోవడానికి ఒక మహిళకు కుటుంబ మద్ధతు ముఖ్యమని చెబుతున్నారు.
News April 13, 2026
పాత ఇంట్లో దొరికిన నాణెం.. వేలంలో ₹1.2కోట్లు

బ్రిటన్ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా పేరుగాంచిన ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ వేలంలో £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికింది. వేల్స్‌లోని ఒక పాత ఇంట్లో దొరికిన ఈ ఐదు పౌండ్ల నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉండటంతో కాయిన్ కలెక్టర్స్ దీనిని నాణేల ప్రపంచంలో ‘హోలీ గ్రెయిల్’(అత్యంత అరుదైనది)గా భావిస్తారు.
News April 13, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.


