News December 2, 2024

డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు

image

1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1912: దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1989: భారత దేశ 8వ ప్రధానిగా వీపీ సింగ్ నియామకం
1996: ఉమ్మడి ఏపీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం

Similar News

News March 23, 2026

హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాలకు వెబ్‌‌సైట్‌: <>https://aphc.gov.in/<<>>

News March 23, 2026

సంచలన ప్రకటన.. యుద్ధానికి బ్రేక్

image

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 5 రోజుల పాటు దాడులు ఆపనున్నట్లు వెల్లడించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్‌ఫ్రాపై మిలిటరీ స్ట్రైక్స్‌ను వాయిదా వేస్తున్నామని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య 2 రోజులపాటు జరిగిన చర్చలు సఫలమయ్యాయని వివరించారు. చర్చలు ఈ వారం మొత్తం కొనసాగుతాయని తెలిపారు.

News March 23, 2026

గల్ఫ్‌ రూట్లను మైన్స్‌తో నింపేస్తాం: ఇరాన్ హెచ్చరిక

image

తమ దేశ తీరం, ద్వీపాలపై దాడికి యత్నిస్తే గల్ఫ్‌ రూట్లను సీమైన్స్‌తో నింపేస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫ్లోటింగ్ మైన్స్‌ను తీరం నుంచే రిలీజ్ చేస్తామని స్పష్టంచేసింది. అదే జరిగితే హార్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితే గల్ఫ్ అంతటా సుదీర్ఘకాలం ఉంటుందని చెప్పింది. 1980ల్లో పెట్టిన సీమైన్స్‌ను తొలగించేందుకు మైన్ స్వీపర్లు ప్రయత్నించి ఫెయిలైన విషయం మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది.