News December 7, 2024

డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

image

1792: భారతదేశంలో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం

Similar News

News November 14, 2025

35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలు.. వరుసగా 9వ సారి ఎన్నిక!

image

బిహార్‌లో సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్(BJP), బిజేంద్ర ప్రసాద్ యాదవ్(JDU) అరుదైన ఘనత సాధించారు. వరుసగా 9వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990 నుంచి వారు MLAలుగా కొనసాగుతుండటం గమనార్హం. తాజా ఎన్నికల్లో గయా టౌన్ నుంచి 26,423 ఓట్ల మెజారిటీతో ప్రేమ్ కుమార్ గెలవగా, సుపౌల్‌లో 16,448 ఓట్ల ఆధిక్యంతో బిజేంద్ర గెలుపొందారు. దాదాపు 35 ఏళ్లుగా ఇద్దరూ అవే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.

News November 14, 2025

టెట్ నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ టెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. D.El.Ed., D.Ed., B.Ed., Language Pandit అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి. B.Ed విద్యార్హత కలిగిన SGTలు పేపర్-1 పరీక్ష రాయవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750 కాగా రెండు పేపర్లకు రూ.1000గా నిర్ధారించారు.
వెబ్‌సైట్: tgtet.aptonline.in/tgtet/

News November 14, 2025

ఉప ఎన్నికల విజేతలు వీరే

image

* జూబ్లీహిల్స్(TG)- నవీన్ యాదవ్(INC)
* అంతా(రాజస్థాన్)- ప్రమోద్ జైన్(INC)
* నువాపడా(ఒడిశా)- జయ్ ఢొలాకియా(BJP)
* నాగ్రోటా(J&K)- దేవయానీ రాణా(BJP)
* బడ్గాం(J&K)- ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ(PDP)
* డంపా(మిజోరం)- లాల్‌థాంగ్లియానా(MNF)
* తరన్‌తారన్(పంజాబ్)- హర్మీత్ సింగ్ సంధు(AAP)
* ఘాట్‌శిలా(ఝార్ఖండ్)- సోమేశ్ చంద్ర సోరెన్(JMM)