News December 11, 2024

డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం

Similar News

News October 23, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ ఫస్ట్ లుక్ రివీల్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ రివీలైంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బియర్డ్ లేకుండా ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అలాగే ఓ సంస్కృత శ్లోకాన్ని మేకర్స్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

News October 23, 2025

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

image

AP: రైతుల నుంచి కనీస మద్దతు ధరకు CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తి రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదై, సీఎం యాప్ ద్వారా లాగిన్ అయి, ఆధార్ అనుసంధానంతో కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. కపాస్ యాప్ స్లాట్ బుకింగ్ ప్రకారం పత్తిని CCI కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. రైతులకు సందేహాలుంటే 7659954529కు కాల్ చేయొచ్చు.

News October 23, 2025

‘కపాస్ కిసాన్ యాప్’లో నమోదు ఎలా?

image

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.