News December 12, 2024

డిసెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1884: తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం
1931: సినీ నటి షావుకారు జానకి జననం
1940: NCP చీఫ్ శరద్ పవార్ జననం
1950: సూపర్ స్టార్ రజినీకాంత్ జననం
1981: క్రికెటర్ యువరాజ్ సింగ్(ఫొటోలో) జననం
* కెన్యా జాతీయ దినోత్సవం(జంహురి డే)

Similar News

News December 5, 2025

నల్గొండ: శిశువు మృతి.. నిర్లక్ష్యంపై కేసు నమోదు.!

image

నల్గొండ జిల్లాలోని చిన్న సూరారానికి చెందిన షేక్ షామిన (24)కు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 5న జన్మించిన శిశువు కొద్దిసేపటికే మృతి చెందారు. డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయాడని తండ్రి హైమత్ హాలీ బంధువులు ఆరోపించారు. హైమత్ హాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేష్ తెలిపారు.

News December 5, 2025

ఈ కంటెంట్ ఇక నెట్‌ఫ్లిక్స్‌లో..

image

Warner Bros(WB)ను నెట్‌ఫ్లిక్స్ <<18481221>>సొంతం<<>> చేసుకోవడంతో విస్తృతమైన కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. 2022 లెక్కల ప్రకారం WBలో 12,500 సినిమాలు, 2,400 టెలివిజన్ సిరీస్‌లు(1,50,000 ఎపిసోడ్లు) ఉన్నాయి. దాదాపు 1,45,000 గంటల కంటెంట్ ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, హ్యారీపొటర్, ది సోప్రానోస్, ఫ్రెండ్స్, ది మెంటలిస్ట్, సూపర్ న్యాచురల్, ది వైర్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌లను WBనే నిర్మించింది.

News December 5, 2025

మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

image

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్‌ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.