News December 20, 2024
డిసెంబర్ 20: చరిత్రలో ఈరోజు

1934: వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం
1940: శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి జననం (ఫొటోలో)
1951: కథారచయిత కన్నేపల్లి చలమయ్య జననం
1988: సినీ నటి బి.జయమ్మ మరణం
☛ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
Similar News
News January 17, 2026
నేడు బంగ్లాతో భారత్ ఢీ

U-19 వన్డే WCలో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్లో విఫలమైన 14ఏళ్ల బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. అతనికి తోడు కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జి, కుందు రాణిస్తే IND గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. అటు తొలి మ్యాచ్లో 5 వికెట్లతో సత్తా చాటిన హెనిల్ పటేల్ను నిలువరించడం బంగ్లాకు కష్టమే. జింబాబ్వేలోని బులవాయో వేదికగా మ్యాచ్ 1pmకు మొదలుకానుంది.
News January 17, 2026
సంక్రాంతి 3 కాదు, 4 రోజుల పండుగ

సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షాదులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి.
News January 17, 2026
అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.


