News December 21, 2024
డిసెంబర్ 21: చరిత్రలో ఈరోజు

1926: సినీ నటుడు అర్జా జనార్ధనరావు జననం
1939: నటుడు సూరపనేని శ్రీధర్ జననం
1959: భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జననం
1972: ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జననం
1972: నటి, నిర్మాత దాసరి కోటిరత్నం మరణం
1989: నటి తమన్నా భాటియా జననం
Similar News
News November 12, 2025
నాగార్జునపై కామెంట్స్.. అర్ధరాత్రి సురేఖ ట్వీట్

TG: హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై <<14263103>>గతంలో<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. అయితే అసందర్భంగా అర్ధరాత్రి 12 గం.కు సురేఖ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కాగా ఆమెపై నాగ్ వేసిన పరువునష్టం కేసు కొనసాగుతోంది.
News November 12, 2025
మధ్యాహ్న భోజనంలో ఫిష్ కర్రీ: మంత్రి శ్రీహరి

TG: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీస్, ఇతర ఆహార పదార్థాలను వండిపెట్టేలా చూస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. త్వరలోనే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌తో మాట్లాడుతానని తెలిపారు. రాష్ట్రంలో 26 వేల నీటి వనరుల్లో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. వీటిలో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రిలీజ్ చేస్తామని చెప్పారు.
News November 12, 2025
ఉదయాన్నే నిద్ర లేవాలని ఎందుకు చెబుతారు?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నిద్రలేచే ప్రకృతిలోని సకల జీవచరాలు నిష్కల్మషంగా, నిస్వార్థంగా, అత్యంత సమయస్ఫూర్తి, అంకితభావంతో ఉంటాయని నమ్మకం. మనిషి కూడా అదే సమయంలో నిద్ర లేస్తే ఆ సుగుణాలు మనలోనూ అలవరతాయని విశ్వాసం. సూర్యోదయానికి ముందు లేస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. లేకపోతే పనులు సకాలంలో పూర్తికావని కాకులు ‘కావ్.. కావ్..’ అంటూ మనకు చెబుతాయి. <<-se>>#Jeevanam<<>>


