News December 27, 2024
డిసెంబర్ 27: చరిత్రలో ఈరోజు

✒ 1822: రేబిస్ టీకా సృష్టికర్త లూయీ పాశ్చర్ జననం
✒ 1911: కలకత్తా కాంగ్రెస్ సభలో తొలిసారిగా జనగణమన ఆలాపన
✒ 1939: టర్కీలో భూకంపం, 32 వేలమంది మృతి
✒ 1945: అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థాపన
✒ 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జననం
✒ 2007: పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య
✒ 2009: నటుడు నర్రా వెంకటేశ్వరరావు కన్నుమూత
Similar News
News October 27, 2025
త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా!

AP: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా కల త్వరలోనే సాకారం కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇవ్వగా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా జిల్లాను ప్రతిపాదించింది. దీంతో మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అటు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం(D)లోకి తిరిగి చేర్చడంపై NOV 7న క్లారిటీ రానుంది.
News October 27, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. తాజాగా దరఖాస్తు గడువు తేదీని నవంబర్ 20 వరకు పొడిగించారు.
వెబ్‌సైట్: <
News October 27, 2025
యాషెస్ తొలి టెస్టుకు కమిన్స్ దూరం

ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యారు. నవంబర్ 21 నుంచి జరిగే మ్యాచ్‌కు వెన్నునొప్పి కారణంగా ఆయన అందుబాటులో ఉండబోరని ఆసీస్ బోర్డు తెలిపింది. దీంతో సీనియర్ బ్యాటర్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కమిన్స్ ప్లేస్‌లో బోలాండ్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. కాగా కమిన్స్ ఇటీవల భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమైన విషయం తెలిసిందే.


