News December 30, 2024

డిసెంబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1879: రమణ మహర్షి జననం
1906: భారత్‌లో ముస్లిం లీగ్ పార్టీ ప్రారంభం
1922: యూఎస్ఎస్ఆర్ (ఒకప్పటి ఐక్య రష్యా) ఏర్పాటు
1971: భారత అణు పితామహుడు విక్రమ్ సారాభాయ్ కన్నుమూత
1973: దిగ్గజ నటుడు చిత్తూరు నాగయ్య కన్నుమూత
1992: చిత్రకారుడు వడ్డాది పాపయ్య కన్నుమూత
2006: నటుడు పేకేటి శివరాం కన్నుమూత
2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉరి

Similar News

News January 2, 2025

GST: APలో 6 శాతం తగ్గుదల.. TGలో 10 శాతం పెరుగుదల

image

2024 డిసెంబర్‌లోనూ ఏపీలో <>జీఎస్టీ వసూళ్లు<<>> 6 శాతం మేర తగ్గాయి. 2023 DECలో రూ.3,545 కోట్లు వసూలవగా, ఈసారి రూ.3,315 కోట్లే నమోదైంది. గత నవంబర్‌లోనూ 10 శాతం మేర జీఎస్టీ వసూళ్లు తగ్గిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో 10 శాతం వృద్ధి నమోదైంది. 2023 DECలో రూ.4,753 కోట్లు వసూలవగా, ఈసారి రూ.5,224 కోట్లు వచ్చింది.

News January 2, 2025

ధైర్యముంటే ఆత్మహత్య చేసుకో.. పునీత్ కేసులో సంచలన విషయాలు

image

ఢిల్లీలో భార్యా బాధితుడు <<15038293>>పునీత్<<>> ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య మణికా, ఆమె పేరెంట్స్ కలిసి పునీత్‌ను మానసికంగా టార్చర్ చేశారని అతని సోదరి తెలిపింది. ‘నువ్వు ఏమీ చేయలేవు, ధైర్యం ఉంటే ఆత్మహత్య చేసుకో’ అని ప్రేరేపించారని వెల్లడించింది. ‘బేకరీలో వాటా, విడాకుల అంశం కోర్టులో ఉన్నప్పటికీ మణికా వేధించేది. పునీత్ ఇన్‌స్టాను హ్యాక్ చేసి ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించేది’ అని పేర్కొంది.

News January 2, 2025

సీఎం అధికారిక నివాసంగా ఉండవల్లి గృహం

image

AP: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గృహాన్ని సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు కూడా సీఎం హోదాలో చంద్రబాబు అక్కడే నివాసం ఉన్నారు. అయితే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఆ నిర్మాణం అక్రమమని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.