News October 21, 2024

హైకోర్టులోనే తేల్చుకోండి: SC

image

TG: గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.

Similar News

News October 21, 2024

మీరూ ‘హాలోవీన్’ సెలబ్రేట్ చేసుకున్నారా?

image

హాలోవీన్ అంటే ఏంటో తెలుసా? సుమారు 2 వేల ఏళ్ల క్రితం బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉండే ‘సెల్ట్స్’ జాతి ప్రజలు దీనిని స్టార్ట్ చేశారు. NOV నుంచి చలికాలం మొదలై వివిధ రకాల వ్యాధులొస్తుండేవి. దానికి ముందురోజే OCT 31న అంతా ఒక దగ్గర చేరి మంటలు వేసి విచిత్ర వేషధారణలతో అతీత శక్తులని తరిమివేయాలనే ఆలోచనతో ఈ ఆచారం మొదలుపెట్టారు. ‘ఆల్ హాలోస్ డే’గా పిలిచేదాన్ని ‘హాలోవీన్’గా మార్చారు.

News October 21, 2024

అలాంటి వారు ఇక‌ నో ఫ్లై జాబితాలో: రామ్మోహ‌న్ నాయుడు

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా ప‌రిగ‌ణించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టిదాకా 75 సంస్థ‌ల‌కు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేర‌క‌మైన భాష‌ను ఉప‌యోగిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

News October 21, 2024

నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.