News April 19, 2024

బోర్డర్ దాటి భవితవ్యం తేల్చుకుంటారు! – 1/2

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా కొందరు నేడు బోర్డర్ దాటి వచ్చి మరీ ఓటు వేయనున్నారు. ఈ అరుదైన దృశ్యం త్రిపురలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద జరగనుంది. పశ్చిమ త్రిపురలోని జాయ్‌పుర్‌ ప్రాంతానికి చెందిన వీరు భారతీయులే అయినా సరిహద్దు అవతల వారి పొలాలు, చేపల చెరువులు ఉండటంతో అదే వారి నివాసం అయిపోయింది. దొంగలు తమ పంటను ఎత్తుకెళ్తారేమోననే భయంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వస్తోందట. <<-se>>#Elections2024<<>>

Similar News

News November 8, 2025

కీలక పోరు.. సూర్య రాణిస్తారా?

image

AUS-IND మధ్య బ్రిస్బేన్ వేదికగా ఇవాళ ఆఖరి T20 జరగనుంది. భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ఈ కీలక పోరులో కెప్టెన్ సూర్య, తిలక్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచులో భారత్ పలు మార్పులు చేసే ఛాన్సుంది. గిల్ స్థానంలో శాంసన్‌, దూబే స్థానంలో నితీశ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ 1:45PMకి ప్రారంభమవుతుంది. కాగా ఐదు T20ల సిరీస్‌లో IND 2-1తో ఆధిక్యంలో ఉంది.

News November 8, 2025

ప్రతి ఆటంకాన్ని తొలగించే వ్రతం ఇదే..

image

సంకటహర గణపతి వ్రతం ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతారు. ఈ వ్రతం చేస్తే ఆర్థిక, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, సంతాన లేమి, విద్యవ్యాపారాల్లో వెనకబాటు తనం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. ‘నర దృష్టి, శత్రు పీడల నుంచి ఈ వ్రతం రక్షణ కల్పిస్తుంది. వివాహం ఆలస్యం కావడం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలు కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఒకసారి చేసినా ఫలితం ఉంటుంది’ అని నమ్మకం.

News November 8, 2025

ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను ప్రారంభించిన చైనా

image

చైనా తమ మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. బుధవారం చైనాలోని సాన్యా పోర్టులో అధ్యక్షుడు జిన్ పింగ్ దీనిని ప్రారంభించినట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘జిన్‌హువా’ పేర్కొంది. కానీ, అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొంది. చైనా తీసుకొచ్చిన లియావోనింగ్(2012), షాన్‌డాంగ్(2019) కంటే ఇది పెద్దదని, దీని బరువు 80 వేల టన్నులని తెలుస్తోంది.