News November 26, 2024

ప్రేమ కథలు చేయొద్దని నిర్ణయించుకున్నా: సిద్ధార్థ్

image

తన జీవితంలో అదితి రావు హైదరీ రూపంలో దేవత వచ్చిందని హీరో సిద్ధార్థ్ అన్నారు. తానిప్పుడు తెలంగాణ అల్లుడిగా ఇక్కడికి వచ్చానని ‘మిస్ యూ’ మూవీ ప్రమోషన్లో మీడియాతో చెప్పారు. 2024 తనకు జరిగిన మంచి పెళ్లి అని సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ అవడం తన డ్రీమ్ కాదని, ఒక మంచి నటుడు అనిపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రేమ కథలు చేయొద్దని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 26, 2025

పల్నాడు: భారంగా మారిన పశుగ్రాసం..!

image

పల్నాడులో ఎక్కువగా వరి కోతకు యంత్రాలు వాడటం వలన వరిగడ్డి చిన్న ముక్కలై పొలంలోనే ఉండిపోవడంతో పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రాసం దొరకని పరిస్థితి నెలకొనడంతో, పశువులకు గడ్డి అందించడం భారంగా మారింది. దీంతో మిర్యాలగూడ వంటి దూర ప్రాంతాల నుంచి అధిక ధరలకు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ వరిగడ్డికి సుమారు రూ.15 వేలు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.