News March 31, 2024

ఎన్నికల్లో పోటీపై 3న నిర్ణయం: సుమలత

image

లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి మరోసారి పోటీపై వచ్చే నెల 3న తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సిట్టింగ్ ఎంపీ, సినీ నటి సుమలత పేర్కొన్నారు. 2019లో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా నెగ్గిన ఈమె.. ఈసారి ఎన్డీఏ తరఫున టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో మాజీ సీఎం కుమారస్వామి పోటీ చేస్తున్నారు.

Similar News

News December 28, 2024

హైడ్రా ఛైర్మన్‌గా సీఎం రేవంత్: రంగనాథ్

image

TG: హైడ్రా ఛైర్మన్‌గా CM రేవంత్ కొనసాగుతారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ‘హైడ్రా పరిధిలో 8 చెరువులు, 12 పార్కులను కాపాడాం. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం. హైడ్రాతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. కొత్తగా ఇల్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.

News December 28, 2024

కాశీ శివయ్యకు తోడైన అయోధ్య రామయ్య.. UPకి పండగ!

image

భవ్యమందిరంలోకి అయోధ్య బాలరామయ్య అడుగుపెట్టిన వేళావిశేషం ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త రెక్కలొచ్చాయి. అతి పవిత్రమైన కాశీ ఇక్కడే ఉంది. ఇక గంగా తీరంలోని శైవ, వైష్ణవ, శాక్తేయ ఆలయాలు ప్రత్యేకం. కాశీ, అయోధ్య కారిడార్ల వల్ల కోట్లాది భక్తులు ఇక్కడికి పోటెత్తుతున్నారు. 2022లో UPని 32.18 కోట్ల మంది సందర్శిస్తే 2024 తొలి ఆర్నెల్లలోనే 33 కోట్ల మంది రావడం విశేషం. దీంతో ఎకానమీకి మేలు జరుగుతోంది.

News December 28, 2024

అయ్యో.. 6 రోజులుగా బోరు బావిలోనే చిన్నారి

image

రాజస్థాన్‌లో ఆరు రోజుల క్రితం బోరుబావిలో పడిన చిన్నారి <<14987957>>చేతనను<<>> తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. NDRF, SDRF, స్థానిక పోలీసులు సంయుక్తంగా మిషన్‌లో పాల్గొంటున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. 150 అడుగుల లోతులో చిక్కుకున్న చేతనను క్లిప్పుల సాయంతో 30 అడుగుల పైకి లాగారు. అయితే ఆరు రోజులవుతున్నా ఇంకా చిన్నారిని కాపాడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.