News September 23, 2025
YCP ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులపై త్వరలో నిర్ణయం: అనిత

AP: గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, మీడియా, అమరావతి ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులపై CM త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి అనిత కౌన్సిల్‌లో ప్రకటించారు. ‘YCP ప్రభుత్వం 2019-24 మధ్య 3116 తప్పుడు కేసులు నమోదు చేసింది. న్యాయమడిగినా, తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టారు. నాపైనా అట్రాసిటీ కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. న్యాయ, పోలీసు శాఖలతో చర్చించి వీటిని పరిష్కరిస్తామని తెలిపారు.
Similar News
News September 23, 2025
మైథాలజీ క్విజ్ – 14 సమాధానాలు

1. రామాయణంలో వాలి కుమారుడు ‘అంగదుడు’.
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ‘విదురుడు’.
3. అత్రి మహాముని భార్య ‘అనసూయ’. ఈ దంపతుల కుమారుడే దత్తాత్రేయుడు.
4. కామాఖ్య దేవాలయం ‘అస్సాం’ రాష్ట్రంలో ఉంది.
5. శ్రీరామనవమి ‘చైత్ర మాసం’లో వస్తుంది.
<<-se>>#mythologyquiz<<>>
News September 23, 2025
PHOTO GALLERY: అమ్మవారి వైభవం

తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఆ జగన్మాత ఆశీస్సులు పొందుతూ పరవశించి పోతున్నారు. పలు జిల్లాల్లో అమ్మవారి అలంకారాలను ఫొటోల్లో వీక్షించి తరించండి.
News September 23, 2025
స్పెషల్ బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు: సజ్జనార్

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 7 వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని, మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉన్నాయని పేర్కొన్నారు. ‘బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయి. డీజిల్, మెయింటెనెన్స్ కోసం 50% అదనంగా వసూలు చేస్తున్నాం. ఇది కొత్త పద్ధతి కాదు.. 2003లో ఇచ్చిన GOనే అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.