News July 24, 2024
త్వరలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై నిర్ణయం: నాదెండ్ల

AP: మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్రంతో కలిసి ఈ స్కీమ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో NDA హామీ ఇచ్చింది.
Similar News
News November 15, 2025
కంపెనీ ఒకటే.. కానీ మార్కెట్‌లో మాత్రం పోటీ!

మాతృ సంస్థలు ఒకటైనా అందులోని ప్రొడక్ట్స్ మార్కెట్‌లో పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా మొబైల్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చైనాకు చెందిన BBK ఎలక్ట్రానిక్స్ Oppo, Vivo, OnePlus, Realme బ్రాండ్స్‌ను కలిగి ఉండగా.. ఇవి వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. Lifebuoy, Lux, Liril, Dove వంటి సోప్ బ్రాండ్స్‌తో పాటు హార్లిక్స్ & బూస్ట్ ప్రొడక్ట్స్‌ను Hindustan Unilever ఉత్పత్తి చేస్తుంది.
News November 15, 2025
8 దేశాలతో మరో మెగా క్రికెట్ టోర్నీ

మహిళల క్రికెట్‌కు ప్రచారం కల్పించడం, విస్తరించడమే లక్ష్యంగా ఐసీసీ మరో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించనుంది. దీనికి ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ అనే పేరు పెట్టింది. తొలి ఎడిషన్ బ్యాంకాక్ వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు జరగనుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, UAE, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, ఉగాండా దేశాలు పాల్గొంటాయి.
News November 15, 2025
రేపు విజయవాడకు CJI జస్టిస్ గవాయ్

AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.


