News September 9, 2024

ఇన్సూరెన్స్‌పై GST తగ్గింపు నిర్ణయం అప్పుడే: కేంద్రమంత్రి

image

మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ రేటు తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. నవంబర్‌లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై మంత్రులతో ఓ కమిటీ వేశామని, అది అక్టోబర్-నవంబర్ వరకు రిపోర్ట్ ఇస్తుందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆరోగ్య బీమాపై 18% జీఎస్టీ ఉంది. దాన్ని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Similar News

News November 18, 2025

మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్‌లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

image

AP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్‌లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.