News April 5, 2024

ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం: రాహుల్ గాంధీ

image

వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 2004కు ముందు కూడా ఎన్డీఏదే అధికారమని ప్రచారం చేసుకున్నారని, కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాతే కూటమి తరఫున ప్రధానమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు.. వాటిని రక్షించే శక్తుల మధ్య పోరు జరుగుతోందన్నారు.

Similar News

News December 21, 2025

రాష్ట్రంలో 182 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

APలోని 26 జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డులో 182 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని చేస్తున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 35-65ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: wdcw.ap.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 21, 2025

NLCIL 575పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(<>NLCIL<<>>) 575 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, డిప్లొమా ఉత్తీర్ణులు JAN 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీలను JAN 9 వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15,028, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.12524 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.nlcindia.in

News December 21, 2025

రేషన్ లబ్ధిదారుల కోసం ‘T-రేషన్’ యాప్

image

TG: రేషన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ‘T-రేషన్’ యాప్ తీసుకొచ్చింది. కార్డు యాక్టీవ్‌లో ఉందా? ఆధార్‌తో లింక్ అయిందా? మీ రేషన్ డీలర్, షాప్ నంబర్, లొకేషన్, రేషన్ కోటా, ఇప్పటివరకు ఎంత అందుకున్నారు వంటి వివరాలు ఈ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. వివరాలన్నీ తెలుగులో అందుబాటులో ఉంటాయి. ప్లేస్టోర్‌‌ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ప్రభుత్వం ఇటీవల మీసేవా వాట్సాప్, యూరియా యాప్‌నూ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.