News September 2, 2024

ఈ ఏడాది చివర్లో రిటైర్మెంట్‌పై నిర్ణయం: సైనా

image

తాను కీళ్లనొప్పుల(ఆర్థరైటిస్)తో బాధపడుతున్నట్లు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. 9 ఏళ్లకే కెరీర్‌ను ప్రారంభించిన తాను వచ్చే ఏడాదికి 35 ఏళ్లకు చేరుకుంటానని తెలిపారు. రిటైర్మెంట్ వల్ల తనపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సైనా 2012 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచారు.

Similar News

News December 7, 2025

రబీ సాగుకి రైతులు సన్నద్ధం

image

తూ.గో. జిల్లాలో రైతులు రబీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 61,318 హెక్టార్లలో రబీ సాగు లక్ష్యం కాగా, దీనికి 3,066 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇప్పటికే 215 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. జిల్లాలో 60 శాతం బోర్ల కింద, 18 శాతం గోదావరి డెల్టాలో, 11 శాతం చెరువుల కింద సాగు చేస్తున్నారు. మిగిలిన 22,543 ఎకరాలు వర్షాధారంగా సాగవుతున్నాయి. బోర్ల కింద రైతులు మురుగు దమ్ము చేసి నారుమళ్లను పోశారు.

News December 6, 2025

నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

image

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.

News December 6, 2025

అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

image

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.