News July 9, 2024
స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం: చంద్రబాబు

AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నష్టాల్లో ఉన్న విద్యుత్ రంగాన్ని సాధ్యమైనంత వరకు గాడిలో పెట్టేందుకు సాయం తీసుకుంటాం. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. వైసీపీ హయాంలో గృహ వినియోగదారులపై 45% ఛార్జీలు పెంచారు. 50 యూనిట్లు వాడిన పేదలపై 100% ఛార్జీలు పెరిగాయి’ అని విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా తెలిపారు.
Similar News
News March 23, 2026
ట్రంప్ భయపడ్డారా?

ఇరాన్‌తో యుద్ధానికి 5 రోజులు బ్రేక్ వేశామన్న ట్రంప్ ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ఆయన భయంతోనే సడన్‌గా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల USకు రూ.లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. హార్ముజ్‌ను ఇరాన్ క్లోజ్ చేయడంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే తమకు మరింత నష్టమని భావించే ట్రంప్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
News March 23, 2026
హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాలకు వెబ్‌సైట్: <
News March 23, 2026
సంచలన ప్రకటన.. యుద్ధానికి బ్రేక్

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 5 రోజుల పాటు దాడులు ఆపనున్నట్లు వెల్లడించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్‌ఫ్రాపై మిలిటరీ స్ట్రైక్స్‌ను వాయిదా వేస్తున్నామని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య 2 రోజులపాటు జరిగిన చర్చలు సఫలమయ్యాయని వివరించారు. చర్చలు ఈ వారం మొత్తం కొనసాగుతాయని తెలిపారు.


