News March 18, 2025

ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానానికి నిర్ణయం

image

ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అనుసంధానానికి గల సాంకేతిక అంశాలపై UIDAIతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. ఇవాళ పలు శాఖల కార్యదర్శులతో సమావేశమైన CEC ఈ మేరకు వెల్లడించారు.

Similar News

News November 10, 2025

ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్

image

* నవంబర్ 14: కాంత(దుల్కర్, భాగ్యశ్రీ, రానా)
* NOV 14: శివ రీరిలీజ్(నాగార్జున, అమల)
* NOV 14: సంతాన ప్రాప్తిరస్తు(విక్రాంత్, చాందిని)
* NOV 14: దే దే ప్యార్ దే 2(అజయ్ దేవగణ్, రకుల్, టబు)
* NOV 13: ఢిల్లీ క్రైమ్-3(నెట్‌ఫ్లిక్స్)
* NOV 14: డ్యూడ్(నెట్‌ఫ్లిక్స్)
* NOV 14: జాలీ ఎల్ఎల్‌బీ(జియో హాట్ స్టార్)

News November 10, 2025

పెరిమెనోపాజ్‌ గురించి తెలుసా?

image

నెలసరి ప్రక్రియలో మార్పులు తలెత్తటం, ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గటం మొదలైనప్పటి నుంచీ నెలసరి నిలిచే ముందు దశ ప్రారంభమవుతుంది. దీన్నే పెరిమెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్‌కు ముందుదశ. ఇది 40ల చివర్లో మొదలవుతుంది. ఈ సమయంలో నెలసరిలో మార్పులు, వేడిఆవిర్లు వస్తుంటాయి. మహిళలు పెరిమెనోపాజ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ఉండాలి. ఆల్కహాల్, ధూమపానం వంటివి మానేయాలి.

News November 10, 2025

నా భర్త హీరోయిన్స్‌తోనే ఎక్కువ గడుపుతాడు: గోవింద భార్య

image

బాలీవుడ్ నటుడు గోవిందపై ఆయన భార్య సునీత సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తన కంటే హీరోయిన్స్ వద్దే ఎక్కువ సమయం గడుపుతాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో మహిళతో గోవింద అఫైర్ ప్రచారంపై స్పందిస్తూ ‘నేను ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోలేదు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయలేను. కాకపోతే ఆమె మరాఠీ నటి అని విన్నా’ అని అన్నారు. వివాదాలతో విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారాన్ని వీరిద్దరూ గతంలో ఖండించారు.