News October 9, 2024
కొత్త రేషన్ కార్డులపై రేపు నిర్ణయం?

AP: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో కొత్త కార్డుల జారీ, అడ్రస్ మార్పులు, కుటుంబ సభ్యుల చేర్పులు/తొలగింపులు వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. 6వేల రేషన్ డీలర్ల భర్తీ, 4వేల కొత్త రేషన్ షాపుల ఏర్పాటుపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే త్వరలోనే రేషన్ కార్డుల తుది డిజైన్ను ఖరారు చేస్తారని తెలుస్తోంది.
Similar News
News December 28, 2025
ఎల్లుండే ముక్కోటి ఏకాదశి! ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నారా?

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి. ఆ రోజు వైష్ణవాలయాలు వైకుంఠ ధామాలుగా మారుతాయి. అదే రోజున మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారని ప్రతీతి. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర దినాన మీరు ఏ ఆలయానికి వెళ్తున్నారు? COMMENT! మరింత సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 28, 2025
‘ముక్కోటి ఏకాదశి’ ఎందుకు స్పెషల్?

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది. ఈరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు చేసే ఉపవాసం మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తుల నుంచి మునుల వరకు అందరూ ఈ రోజును మోక్షాన్ని ప్రసాదించే గొప్ప పర్వదినంగా భావిస్తారు.
News December 28, 2025
తిరుమలలో స్థలం ఇవ్వాలని పవన్, అనగానిల అభ్యర్థన.. తిరస్కరించిన TTD

AP: తిరుమలలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలన్న డిప్యూటీ సీఎం పవన్, మంత్రి అనగాని సత్యప్రసాద్ల అభ్యర్థనను టీటీడీ తిరస్కరించింది. ఈ నెల 16న పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా బయటకు వచ్చింది. కొండపై పరిమితంగా భూములు ఉండటం, కొత్త నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న భవనాలు కేటాయిస్తామని సదరు మంత్రులకు సమాచారం ఇచ్చింది.


