News September 27, 2024

డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: సీఎం చంద్రబాబు

image

AP: భక్తులు పవిత్రంగా భావించే తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇతర మతస్థులు అక్కడికెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ‘దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. జగన్‌కు తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పాం. తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది’ అని తెలిపారు.

Similar News

News December 21, 2024

శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.

News December 21, 2024

కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ <<14942476>>అసెంబ్లీలో<<>> సీఎం రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై ఆయనతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

News December 21, 2024

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేనా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 3 గ్రూప్ మ్యాచులు ఆడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడుతుందని తెలుస్తోంది. కాగా గ్రూప్-1లో ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉంటాయని, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా ఉంటాయని సమాచారం.