News April 15, 2025
దేశంలో తగ్గుతున్న డీజిల్ డిమాండ్

దేశంలో డీజిల్ డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2022-2023లో దాని వినియోగంలో 12.1శాతం వృద్ధి కనిపించగా, 2024-25లో అది 2శాతానికి పడిపోయింది. వ్యవసాయ యంత్రాలు, డీజిల్ ట్రక్కుల వాడకం తగ్గడం.. ఈవీల వాడకం పెరగడమే దీనికి కారణంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, పెట్రోల్ వినియోగం 7.5 శాతం పెరిగి 4 కోట్ల టన్నులకు, ఎల్పీజీ డిమాండ్ 5.6 శాతం పెరిగి 3.13 కోట్ల టన్నులకు చేరింది.
Similar News
News April 16, 2025
30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

APలోని 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఒకరికి పదవులు దక్కాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
News April 16, 2025
స్మితా సబర్వాల్కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?

TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. IAS అధికారిణి <<16116901>>స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై<<>> చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. BJP నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కంచ భూములపై మోదీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ, BRS కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం కూలగొడితే కూలిపోయేది కాదని పేర్కొన్నారు.
News April 16, 2025
IPL: ఒకే ఓవర్లో 4, 4, 6, 4, 4

రాజస్థాన్పై ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టిస్తున్నారు. దేశ్పాండే వేసిన రెండో ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బౌండరీలు బాదారు. చివరి బంతికి సింగిల్ తీయడంతో ఆ ఓవర్లో మొత్తం 23 రన్స్ వచ్చాయి.