News August 28, 2024
డిగ్రీలకు తగ్గిపోతున్న ఆదరణ

AP: ఇంజినీరింగ్పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరగడంతో డిగ్రీలకు ఆదరణ తగ్గిపోయింది. రాష్ట్రంలో 2021-22లో 2,48,388 మంది డిగ్రీలో చేరగా, 2023-24లో 1,55,358 మంది మాత్రమే చేరారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు లక్ష ప్రవేశాలు తగ్గిపోయాయి. విద్యార్థులు బీకాం, బీఎస్సీలో చేరుతున్నా బీఏకు ఆదరణ కరవైంది. భవిష్యత్లో డిగ్రీ, పీజీ చేసేవారు లేకపోతే అధ్యాపకులు లభించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.
Similar News
News November 21, 2025
ఏ వ్రతం ఎప్పుడు చేయాలి?

పెళ్లి కాని అమ్మాయిలు కాత్యాయనీ వ్రతాన్ని ధనుర్మాసంలో చేయాలి. ఈ వ్రతంలో భాగంగా శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ గోదాదేవి రచించిన 30 పాశురాలను నిత్యం పఠిస్తే.. మంచి భర్త వస్తాడని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ మాసంలోని ప్రతి గురువారం (NOV 27, DEC 4, 11, 18) లక్ష్మీదేవికి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయట. DEC 3వ తేదీన వస్తున్న హనుమద్వ్రతాన్ని ఆచరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
News November 21, 2025
టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటివరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి. పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తు చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకూ TET తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లూ టెట్కు అప్లై చేశారు. అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు.
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.


