News June 21, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన చేరికలు!

image

TG: ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గినట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 1వ తరగతిలో 60,673 మంది చిన్నారులే ప్రవేశం పొందినట్లు తెలిపింది. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ సూళ్లలో సగటున క్లాసుకు 1.90 లక్షల మంది విద్యార్థులుండగా, ఇంత తక్కువ ప్రవేశాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు వరకు ప్రవేశాలకు అవకాశమున్నా ఇంకా లక్ష మంది చేరేది సందేహంగానే ఉంది.

Similar News

News January 24, 2026

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి

image

AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే యూనిట్‌కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో యూనిట్‌పై రూ.1.19 తగ్గించి రూ.4కే ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19 ఉండేదని, అందులో 29 పైసలు తగ్గించామని చెప్పారు. మరో 90 పైసలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

News January 24, 2026

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News January 24, 2026

800 ఉరిశిక్షలు ఆపానని ట్రంప్ ప్రకటన.. అంతా ఉత్తదేనన్న ఇరాన్

image

తన జోక్యంతో 800కు పైగా నిరసనకారుల <<18930505>>మరణశిక్షలు<<>> ఆగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. అందులో నిజం లేదని స్పష్టంచేసింది. ‘ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఆ స్థాయిలో మరణశిక్షలు లేవు. న్యాయవ్యవస్థ కూడా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు’ అని ఇరాన్ టాప్ ప్రాసిక్యూటర్ మహ్మద్ మొవహేదీ చెప్పారు. కాగా ఇరాన్ వైపు యుద్ధ నౌకలు వెళ్తున్నాయని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.