News May 14, 2024

హెచ్1బీపై భారతీయ కంపెనీల్లో తగ్గిన ఆసక్తి!

image

భారతీయ ఐటీ కంపెనీలు H1B వీసా మీద ఇక్కడి ఉద్యోగులను US పంపడం ఒకప్పటి ట్రెండ్. అయితే గతకొన్నేళ్లుగా ఈ ట్రెండ్ నెమ్మదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. టాప్ 7 కంపెనీల్లో హెచ్‌1బీ వర్క్ వీసాను వినియోగించుకోవడం 8ఏళ్లలో 56% తగ్గింది. వీసా ఆమోదంలో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో స్థానికులను నియమించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయట. టెక్నాలజీ అందుబాటులో ఉండటం కూడా మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 14, 2026

కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్ కన్నుమూత

image

కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్(80) కన్నుమూశారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా కాపాడలేకపోయామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాహస సింహా, సింహా జోడి వంటి పాపులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రవివర్మ, మణి, టైమ్ బాంబ్ తదితర సినిమాల్లో నటించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.

News February 14, 2026

మచిలీపట్నంలోని BELలో పోస్టులు

image

మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్<>(BEL<<>>) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ముందుగా apprenticeshipindia.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 22న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.9,600 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News February 14, 2026

నామినేషన్ కోసమే రూ.8కోట్లు.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఓటమి

image

TG: నామినేషన్ సమయంలో రూ.8కోట్ల పన్ను కట్టిన నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు ఓటర్లు షాకిచ్చారు. 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆమె BJP అభ్యర్థి చేతిలో ఓడారు. పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడలేదని తెలుస్తోంది. తన డివిజన్‌లో ఒక్కో ఓటుకు ₹5వేల వరకు పంచినట్లు సమాచారం. మిగతా డివిజన్లకూ డబ్బు సర్దడంతో ₹20కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.