News March 23, 2025
రేపటి నుంచి డీఈఈ సెట్ దరఖాస్తులు

TG: రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈ సెట్‌కు ఈనెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 25న ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు గతంలో కంటే రెండు నెలల ముందుగానే విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
వెబ్సైట్: <
Similar News
News March 24, 2025
వారికి రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు: తుమ్మల

TG: ప్రతి రైతు కుటుంబానికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నామని, రూ.20వేల కోట్లు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులను మోసం చేసిన పార్టీలకు దీనిపై మాట్లాడే హక్కు లేదని అసెంబ్లీలో MLA పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుభరోసా నిధులు ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు.
News March 24, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల కేసులు నమోదైన సెలబ్రిటీలను సాక్షులుగా మార్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో 25 మంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
News March 24, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌కు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌కు ఊరట దక్కింది. అతడిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో శ్రవణ్ పోలీసుల విచారణకు సహకరించాలని పేర్కొంది. ఇదే కేసులో నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం 2 వారాల సమయం కోరింది. దీంతో విచారణను ఉన్నత న్యాయస్థానం 2 వారాలు వాయిదా వేసింది.